మన ప్రధానిని కలిసిన 'బాహుబలి'
- July 26, 2015
బాహుబలి ఘన విజయం సాధించడంతో ఉరిమే ఉత్సాహంతో ఉన్న సినీ హీరో ప్రభాస్ ఆదివారం తన పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు 10 నిమిషాలపాటు ప్రధానితో వీరి భేటీ సాగింది. ఈ సదర్భంగా ప్రధాని మోదీ బాహుబలి చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించినట్లు తెలిసింది. మోదీతో భేటీ అనంతరం కృష్ణంరాజు, ప్రభాస్ మీడియాతో మాట్లాడారు. బాహుబలి సినిమా గురించి విన్నానని ఈ చిత్రం చాలా బాగుందని తనకు చాలా మంది చెప్పారని మోదీ అన్నట్లు కృష్ణంరాజు తెలిపారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ మోదీతో 10 నిమిషాలు మాట్లాడామని, ఆయనతో మాట్లాడటం చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు. బాహుబలి సినిమా చూడాలని తాను ప్రధానిని కోరగా ప్రస్తుతం బిజీగా ఉన్నానని, తప్పకుండా చూస్తానని చెప్పారని ప్రభాస్ తెలిపారు. తన జీవితంలో ఈ రోజు చాలా సంతోకరమైనదని ప్రభాస్ ఉబ్బితబ్బిబ్బైపోయారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులు బాహుబలిని చూశారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







