వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్
- June 30, 2026
మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసే కీలక ఫీచర్‌ను ప్రకటించింది. త్వరలో ఫోన్ నంబర్‌ను పంచుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రత్యేక యూజర్‌నేమ్ (Username) ద్వారా ఇతరులతో చాట్ చేసే అవకాశం కల్పించనున్నట్లు సోమవారం వెల్లడించింది.
ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రతి వినియోగదారు ఒక ప్రత్యేకమైన యూజర్‌నేమ్ ఎంచుకోవచ్చు. ఆ యూజర్‌నేమ్‌ను ఇతరులతో పంచుకోవడం ద్వారా ఫోన్ నంబర్ వెల్లడించకుండా సంభాషణ ప్రారంభించవచ్చు. దీంతో ముఖ్యంగా కొత్త వ్యక్తులు, వ్యాపార సంస్థలు లేదా పెద్ద గ్రూప్‌లలో చేరినప్పుడు వ్యక్తిగత మొబైల్ నంబర్ గోప్యంగా ఉంటుంది.
అలాగే, యూజర్‌నేమ్‌ల కోసం ప్రత్యేక డైరెక్టరీ లేదా సెర్చ్ సూచనలు ఉండవని మెటా తెలిపింది. ఎవరినైనా సంప్రదించాలంటే వారి ఖచ్చితమైన యూజర్‌నేమ్ తెలిసి ఉండాల్సి ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్న వాట్సాప్‌లో అందరికీ ఇష్టమైన యూజర్‌నేమ్ లభించే అవకాశం లేకపోవచ్చని సంస్థ పేర్కొంది. అందువల్ల వీలైనంత త్వరగా యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకోవాలని సూచించింది.
ఈ ఫీచర్‌ను రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఆయా దేశాల్లో ఈ సదుపాయం ప్రారంభమైనప్పుడు యాప్ ద్వారా వినియోగదారులకు సమాచారం అందిస్తామని తెలిపింది.
అంతేకాకుండా, కంటెంట్ క్రియేటర్లు, చిన్న వ్యాపార సంస్థలు, వివిధ సంస్థలు ఇప్పటికే ఫేస్బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపయోగిస్తున్న యూజర్‌నేమ్‌లను వాట్సాప్‌లో కూడా వినియోగించుకునే అవకాశం కల్పించనున్నట్లు మెటా వెల్లడించింది.
తాజా వార్తలు
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్‌పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







