నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- July 01, 2026
నంద్యాల: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా చేపట్టిన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కార్యక్రమం బుధవారం మూడో రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో పార్టీ భావజాలంపై ఆసక్తి కలిగిన జనసేన నాయకులు, జనసైనికులు వివిధ స్థాయిల్లోని పార్టీ పదవులకు దరఖాస్తులు సమర్పించాలని పిలుపునిచ్చారు.పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, అర్హులైన నాయకులకు అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.
ఈ సమావేశంలో నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చింతా సురేష్ బాబు, పాణ్యం నియోజకవర్గ ముఖ్య నాయకులు, జనసైనికులు, వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ పై సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







