జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- July 01, 2026
ఆధార్: ఆధార్‌తో ఈ మెయిల్ లింక్ చేసుకోవడం లేదా అప్డేట్ చేసుకోవడాన్ని ఉచితం చేస్తూ ‘ద యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)’ నిర్ణయం తీసుకుంది.గతంలో దీనికి రూ.75 ఛార్జీ వసూలు చేసేవారు. ఇప్పుడు జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉచితంగా ఈ సర్వీస్ వాడుకోవచ్చు.
పాస్‌పోర్ట్ ధరల పెంపు: జూలై 1 నుంచి పాస్‌పోర్ట్ ఫీజుల్ని కేంద్రం పెంచింది.14 ఏళ్ల తర్వాత ఈ ఫీజుల ధరల్ని కేంద్రం సవరించింది.దీని ప్రకారం.. 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌కు గతంలో రూ.1,500 ఫీజు ఉండగా, ఇప్పుడు రూ.2,500 చెల్లించాలి. తత్కాల్ పాస్‌పోర్ట్‌కు గతంలో రూ.3,500 ధర ఉండగా, ఇప్పుడు రూ.5,000 చెల్లించాలి. ఇతర ఫీజుల్లో కూడా మార్పులు చేసింది.
రైళ్లలో టిక్కెట్ లేకుంటే ఫీజు రెట్టింపు: రైళ్లలో టిక్కెట్ లేకుండా చేసే ప్రయాణానికి సంబంధించి ఫీజును కూడా రైల్వే శాఖ రెట్టింపు చేసింది. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే ఇంతకుముందు రూ.250 ఫీజు ఉండేది. ఇప్పుడు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది..
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్‌కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







