కువైట్ అమీర్‌ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- July 02, 2026
కువైట్ సిటీ: లులు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఏ.యూసఫ్ అలీ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాహ్ను బయాన్ ప్యాలెస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 30న జరిగిన ఈ సమావేశంలో లులు గ్రూప్ ప్రతినిధి బృందం కూడా పాల్గొంది.
ఈ సందర్భంగా సంక్షోభ సమయాల్లో కువైట్‌లో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి లులు గ్రూప్ చేపట్టిన వివిధ కార్యక్రమాలను అమీర్‌కు యూసఫ్ అలీ వివరించారు. దేశంలో అవసరమైన ఆహార సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు సంస్థ తీసుకున్న చర్యలను వివరించినట్లు తెలిపారు.
లులు గ్రూప్ కువైట్ ఆహార భద్రతకు అందిస్తున్న సేవలు, నిబద్ధతను అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాహ్ అభినందించినట్లు వెల్లడించారు. దేశ ప్రజలకు అవసరమైన ఆహార సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంలో లులు గ్రూప్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.
ఈ సమావేశానికి అవకాశం కల్పించిన కువైట్ అమీర్‌కు యూసఫ్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. కువైట్ అభివృద్ధి, ఆహార భద్రత రంగాల్లో ప్రభుత్వంతో కలిసి మరింత సమర్థవంతంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.


తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







