'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- July 03, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆధునికీకరణలో భాగంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ శుక్రవారం పలు కీలక మౌలిక సదుపాయాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన 'ది లయన్స్ – బెల్ ఆఫ్ ఆర్మ్స్' ఆర్మరీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆధునిక భద్రతా ప్రమాణాలతో నిర్మించిన ఈ ఆర్మరీ ద్వారా ఆయుధాల భద్రపరిచే వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారనుందని అధికారులు తెలిపారు.
అనంతరం పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌కు చెందిన 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను డీజీపీ ప్రారంభించారు. పోలీసు శాఖకు చెందిన వాహనాల నిర్వహణ, మరమ్మతులు, సేవలను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
అదే కార్యక్రమంలో 'సారథి' మొబైల్ యాప్‌ను కూడా డీజీపీ ప్రారంభించారు. పోలీసు రవాణా విభాగంలో సేవలను డిజిటలైజ్ చేయడం, వాహనాల నిర్వహణను సులభతరం చేయడం, పనితీరులో పారదర్శకత పెంపొందించడం లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







