విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- July 04, 2026
అవార్డుల ఫ్లయర్ ఘనంగా ఆవిష్కరణ–నెలాఖరులో ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవం
విజయవాడ: వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి సత్కరించేందుకు స్టేట్ ఐకాన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’ కార్యక్రమానికి సంబంధించి అధికారిక ఫ్లయర్‌ను శనివారం విజయవాడ ఎంజీ రోడ్డులోని ఆదిత్య బిర్లా ఇంద్రియ జ్యువెలర్స్‌లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఇంద్రియ జ్యువెలరీ వెన్యూ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో స్టేట్ ఐకాన్స్ ఫోరం అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి జయా పటేరియా మాట్లాడుతూ, విజయవాడ వేదికగా తొలిసారిగా స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్ నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులో నగరంలోని హయత్ ప్లేస్ హోటల్‌లో అవార్డుల ప్రదానోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమాజంలో తమ తమ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులను గుర్తించి, వారి సేవలను గౌరవించడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యాపారం, కళలు, సాంస్కృతికం, మీడియా, సామాజిక సేవ, క్రీడలు తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడం, సేవాభావంతో పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు కల్పించడం, యువతకు స్ఫూర్తినిచ్చే విజయగాథలను సమాజానికి అందించడం ఈ అవార్డుల ముఖ్య లక్ష్యమని వారు వివరించారు. భవిష్యత్తులో ఈ అవార్డులను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విశ్వసనీయ గుర్తింపుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026 అధికారిక ఫ్లయర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మిస్ ఇండియా చార్మింగ్ ఫేస్ అనయ కశ్యప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ ఐకాన్స్ ఫోరం ఉపాధ్యక్షులు మిత్తాన ఈశ్వర్, జాయింట్ సెక్రటరీ కోడె చైతన్య, ట్రెజరర్ ఆర్.వి.అప్పా రావు, ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మంథా శ్రీనివాస్, బీజేపీ మహిళా మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ సిరి కిరణ్, బిగ్‌బాస్ ఫేమ్ షానీ సాల్మన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







