బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!

- July 05, 2026 , by Maagulf
బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!

రియాద్:  గతంలో తమ యాజమాన్యంలో ఉన్న బోయింగ్ 777-200 విమానాలతో తమకు ఎటువంటి నిర్వహణ లేదా వాణిజ్యపరమైన సంబంధం లేదని సౌదియా (Saudia) స్పష్టం చేసింది.  వాణిజ్య మరియు చట్టపరమైన విధానాలకు అనుగుణంగా 2023. జూన్ 7న సౌదీ అరేబియా వెలుపల నమోదైన ఒక సంస్థకు ఆ విమానాలను విక్రయించినట్లు తెలిపింది.
కాగా, అంతర్జాతీయ ఆంక్షలకు గురైన ఒక సంస్థకు ఈ విమానాలను విక్రయించారని మీడియా మరియు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించింది. విక్రయం పూర్తయినప్పటి నుండి ఆ విమానాలతో తమకు ఎటువంటి నిర్వహణ లేదా వాణిజ్యపరమైన సంబంధం లేదని సౌదియా పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com