ఒమన్‌లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!

- July 05, 2026 , by Maagulf
ఒమన్‌లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!

మస్కట్: రహదారి వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచడానికి రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక పబ్లిక్ అడ్వైజరీని జారీ చేసింది. వాహనాల విండో టింటింగ్‌ను నియంత్రించే నిబంధనలపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. రహదారి భద్రతా అవసరాలకు అనుగుణంగా టింట్ పరిమితులను పునరుద్ఘాటించింది.

వాహనం ముందు విండ్‌షీల్డ్ మినహా, వాహనాల విండోలకు టింట్ వేయవచ్చు. ముందు విండ్‌షీల్డ్‌కు టింట్ వేయడానికి అనుమతి లేదు. మిగిలిన వాహన విండోలకు గరిష్టంగా అనుమతించదగిన టింట్ స్థాయి 50 శాతం.

ఫ్యాక్టరీలోనే అమర్చిన టింటెడ్ సైడ్ విండోలు ఉన్న వాహనాలకు కూడా అనుమతి ఉందని, అయితే ఆ గ్లాస్ కనీసం 30 శాతం లైట్ ట్రాన్స్ మిషన్ కలిగి ఉండాలని ROP పేర్కొంది. అలాగే,  వాహనదారులు మ్యాట్ (నాన్-గ్లాస్) వెహికల్ ర్యాప్‌లు లేదా పెయింట్ ఫినిషింగ్‌లను ఉపయోగించవచ్చని తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com