బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!

- July 05, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!

మనామా: బహ్రెయిన్ లో రోజుకు 60 మిలియన్ ఇంపీరియల్ గ్యాలన్ల వరకు ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో హిద్‌లో కొత్త తాగునీటి ప్లాంటు రానుంది.  ఇందు కోసం అక్వా పవర్ సమర్పించిన బిడ్ కు ఆమోదం లభించింది. దీనిని బహ్రెయిన్ ఇండిపెండెంట్ వాటర్ ప్రొడ్యూస్ ప్రోగ్రామ్ కింద నిర్వహించనున్నారు.  ఈ ప్లాంటు 2028లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ బహ్రెయిన్ దీర్ఘకాలిక నీటి భద్రతను బలోపేతం చేస్తుందని అధికారులు వెల్లడించారు.  

హిద్ ఇండిపెండెంట్ వాటర్ ప్రాజెక్ట్ కోసం సౌదీ అరేబియాకు చెందిన అక్వా పవర్ ఏకైక బిడ్డర్‌గా నిలిచిందని టెండర్ బోర్డ్ డేటా వెల్లడించింది. ఉత్పత్తి చేసే ప్రతి క్యూబిక్ మీటర్ నీటికి కంపెనీ BD0.276 కోట్ చేసింది. దీని ప్రకారం, ప్రతి 1,000 లీటర్ల స్వచ్ఛమైన నీటి ఉత్పత్తికి సుమారు 276 ఫిల్స్ ఖర్చవుతుంది. ఈ మొత్తం నీటి ఉత్పత్తి టారిఫ్ మాత్రమే.  ప్లాంట్ నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చు ఇందులో రాదని, ఈ పథకాన్ని ఇండిపెండెంట్ వాటర్ ప్రొడ్యూసర్స్ మోడల్ కింద అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్లాంట్ ఒప్పంద సామర్థ్యం గంటకు 11,364 క్యూబిక్ మీటర్లుగా ఉంటుంది. కొన్ని పాత వ్యవస్థలతో పోలిస్తే ఎనర్జీ వినియోగాన్ని తగ్గించడానికి రూపొందించిన సముద్రపు నీటి రివర్స్ ఆస్మోసిస్ అనే డీశాలినేషన్ పద్ధతిని ఈ కొత్త ప్లాంట్ లో ఉపయోగించనున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com