కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- July 05, 2026
కువైట్: కువైట్ లో కొన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు జైలు శిక్షలకు బదులుగా ప్రత్యామ్నాయ శిక్షలను విధించనున్నారు. ఇందుకోసం న్యాయస్థానాలకు అధికారం కల్పిస్తూ, కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త ఎగ్జిక్యూటివ్ నిబంధనలను ఆమోదించింది.
మొదటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబాహ్ జారీ చేసిన ఈ కొత్త నిబంధనలు, అధికారిక గెజెట్‌లో ప్రచురితమైన వెంటనే అమల్లోకి వచ్చాయి.
ఈ నిబంధనల ప్రకారం, న్యాయస్థానాలు జైలు శిక్షకు బదులుగా సామాజిక సేవ, ట్రాఫిక్ అవగాహన మరియు పునరావాస కార్యక్రమాలకు హాజరు కావడం, శిక్షణా వర్క్ షాపులు, ఉల్లంఘన వలన కలిగిన నష్టాన్ని మరమ్మతు చేయించడం వంటి శిక్షలను విధించవచ్చు. సాధారణ పరిపాలన విభాగం ఈ శిక్షల అమలును పర్యవేక్షిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్‌లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్‌లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







