శంషాబాద్‌ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..

- July 09, 2026 , by Maagulf
శంషాబాద్‌ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..

శంషాబాద్‌: శంషాబాద్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం అదుపుతప్పి బస్టాండ్‌లో వేచిఉన్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించగా.. మరికొందరికి గాయాలయ్యాయి. గురువారం తెల్లవారుజామున సతమరాయి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రోడ్డుపై వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి బస్టాప్‌లో వేచిఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అప్పటికే శంషాబాద్–సతమరాయి మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై ప్రమాదానికి గురైన వాహనం, సహాయక చర్యల కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు బొలెరో వాహనాన్ని పక్కకు తప్పించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి ఆసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com