ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ

- July 09, 2026 , by Maagulf
ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో గురువారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షాలతో రోడ్లు చెరువులను తలపించాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాలకు ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, మునీర్కా వంటి ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశంలో కురుస్తున్న వర్షాలపై సమీక్షించి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com