ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- July 12, 2026
మస్కట్: ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాల జాబితాలో ఒమన్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. 2026 యూఎస్ న్యూస్ బెస్ట్ కంట్రీస్ – పబ్లిక్ సేఫ్టీ ర్యాంకింగ్స్ లో ఈ ఘనత సాధించింది. తద్వారా పౌరులు, ప్రవాసులు, పర్యాటకులకు అత్యంత భద్రమైన దేశంగా మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ర్యాంకింగ్స్‌లో సింగపూర్ తొలి స్థానంలో నిలవగా, ఒమన్ రెండో స్థానం, జపాన్ మూడో స్థానం దక్కించుకున్నాయి. అనంతరం ఖతార్, వియత్నాం, హంగేరీ, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, లక్సెంబర్గ్ దేశాలు వరుసగా స్థానాలు సంపాదించాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఉన్న భద్రతపై అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించారు. ఇది యూఎస్ న్యూస్ బెస్ట్ కంట్రీస్ నివేదికలో భాగంగా విడుదలైంది. తక్కువ నేరాల రేటు, రాజకీయ స్థిరత్వం, ప్రశాంత వాతావరణం, ఆతిథ్య భావన కారణంగా ఒమాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. నివసించడానికి, ఉద్యోగాలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి, పర్యటించడానికి అనువైన సురక్షిత దేశంగా ఒమాన్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. తాజా ర్యాంకింగ్‌తో మధ్యప్రాచ్యంతో పాటు ప్రపంచంలోని అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా ఒమన్ తన ప్రతిష్ఠను మరింత బలోపేతం చేసుకుంది.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







