యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- July 12, 2026
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్న భారతీయులకు భారత కాన్సులేట్ కీలక ప్రకటన చేసింది. పాస్‌పోర్టు రెన్యువల్ సేవల కోసం ఇకపై వాక్-ఇన్ సేవలు ఉండవని, తప్పనిసరిగా ఆన్లైన్లో ముందస్తు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. జూలై 10న విడుదల చేసిన తాజా ప్రకటనలో పాస్‌పోర్టు రెన్యువల్ అపాయింట్మెంట్ బుకింగ్ విధానాన్ని వివరించింది.
ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకునే విధానం:
* అధికారిక వెబ్సైట్ book.passportindiauae.comను సందర్శించాలి.
* పేరు, ఈ-మెయిల్ చిరునామా, పాస్‌వర్డ్‌తో నమోదు చేసుకోవాలి.
* ఈ-మెయిల్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
* అనంతరం లాగిన్ అయి, తమ పరిధికి సంబంధించిన కార్యాలయాన్ని ఎంచుకోవాలి. ఇందులో దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ లేదా అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
* అవసరమైన వివరాలు నమోదు చేసి, అందుబాటులో ఉన్న తేదీ, సమయాన్ని ఎంపిక చేసి అపాయింట్మెంట్ను నిర్ధారించుకోవాలి.
అపాయింట్మెంట్ బుక్ చేసుకునే ముందు పాస్‌పోర్టు రెన్యువల్ దరఖాస్తు ఫారమ్‌ను ఆన్లైన్లో పూర్తి చేసి, దాని ప్రింట్ కాపీని వెంట తీసుకురావడం తప్పనిసరి అని భారత కాన్సులేట్ సూచించింది.
అదేవిధంగా, BLS International మరియు SGIVS Global సంస్థలు ఇకపై ఎలాంటి కాన్సులర్ సేవలు అందించడానికి అనుమతి లేదని భారత మిషన్ స్పష్టం చేసింది. కాగా, కొత్త కాన్సులర్, పాస్‌పోర్టు, వీసా (CPV) సేవల అమలు పరిపాలనా కారణాలతో తాత్కాలికంగా వాయిదా పడిన నేపథ్యంలో ఈ కొత్త అపాయింట్మెంట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది







