బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ

- July 12, 2026 , by Maagulf
బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ

అబూదాబి: బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తాజాగా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులను యూఏఈ తీవ్రంగా ఖండించింది.

ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) విడుదల చేసిన ప్రకటనలో, ఈ దాడులు సోదర దేశాల సార్వభౌమాధికారాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమే కాకుండా, వాటి భద్రత, స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా ఉన్నాయని పేర్కొంది.

బహ్రెయిన్, కువైట్, ఖతార్ , హషెమైట్ కింగ్‌డమ్ ఆఫ్ జోర్డాన్, ఒమాన్ సుల్తానేట్‌లకు యూఏఈ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది. ఆయా దేశాల భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు వారు చేపడుతున్న అన్ని చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ప్రాంతీయ భద్రత, శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడం అత్యంత కీలకమని యూఏఈ పునరుద్ఘాటిస్తూ, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా అన్ని పక్షాలు సంయమనం పాటించాలని పిలుపు నిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com