పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- July 12, 2026
మస్కట్: ఒమన్ సముద్ర తీరంలో 'జీఎఫ్ఎస్ గెలాక్సీ' (GFS Galaxy) నౌక ప్రమాదానికి గురైన ఘటనలో పది మంది భారతీయ సిబ్బందిని ఒమన్ అధికారులు సురక్షితంగా రక్షించారు. అయితే, మరో భారతీయ పౌరుడు గల్లంతైనట్లు మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) వెల్లడించింది.
ఈ ప్రమాద సంఘటనపై తాము నిరంతరం నిఘా ఉంచామని, ఒమన్ అధికారులు, నౌక యాజమాన్యం మరియు ఇతర సంబంధిత వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొంది. ప్రమాద బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నట్లు రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







