బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- July 12, 2026
అబూదాబి: బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తాజాగా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులను యూఏఈ తీవ్రంగా ఖండించింది.
ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) విడుదల చేసిన ప్రకటనలో, ఈ దాడులు సోదర దేశాల సార్వభౌమాధికారాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమే కాకుండా, వాటి భద్రత, స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా ఉన్నాయని పేర్కొంది.
బహ్రెయిన్, కువైట్, ఖతార్ , హషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్, ఒమాన్ సుల్తానేట్లకు యూఏఈ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది. ఆయా దేశాల భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు వారు చేపడుతున్న అన్ని చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ప్రాంతీయ భద్రత, శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడం అత్యంత కీలకమని యూఏఈ పునరుద్ఘాటిస్తూ, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా అన్ని పక్షాలు సంయమనం పాటించాలని పిలుపు నిచ్చింది.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







