స్వాతంత్ర దినోత్సవానికి ముస్తాబవుతున్న ఎర్రకోట.!

- August 13, 2016 , by Maagulf
స్వాతంత్ర దినోత్సవానికి ముస్తాబవుతున్న ఎర్రకోట.!

ఆగస్టు 15న జరిగే 70వ స్వాతంత్య్రదినోత్సవానికి దేశరాజధాని దిల్లీలోని ఎర్రకోట ముస్తాబవుతోంది. వేడుకల్లో పాల్గొనే పలు పాఠశాలల చిన్నారులు రిహార్సల్స్‌ ప్రారంభించారు. మరోవైపు త్రివిధ దళాల సిబ్బంది కూడా విన్యాసాలు ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు డ్రోన్ల ద్వారా భద్రతా చర్యలు చేపట్టనున్నారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
దిల్లీలో భద్రత కట్టుదిట్టం మరోవైపు స్వాతంత్య్రదినోత్సవం నేపథ్యంలో దేశరాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 15న పోలీసుల సెలవులను రద్దు చేస్తున్నామని.. అందరూ హాజరుకావాలని పోలీస్‌ కమిషనర్‌ అలోక్‌ వర్మ చెప్పారు. ప్రతి పీసీఆర్‌ వ్యాన్‌లో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని వర్మ సూచించారు. పర్యాటక ప్రదేశాలు, రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com