నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు - కమల్
- August 13, 2016
విలక్షణ కథానాయకుడు కమల్‌హాసన్ ఇటీవల జరిగిన ప్రమాదానంతరం తిరిగి కోలుకున్నారు. ఆల్వార్‌పేటలోని తన కార్యాలయం మెట్లు ఎక్కుతూ జారిపడటంతో ఈమధ్యనే ఆయన కుడి కాలికి సర్జరీ జరిగింది. గత వారంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు. రెండ్రోజులుగా ఆయన జిమ్‌కు వెళ్తున్నారు. ఇదే విషయాన్ని తన అభిమానులతో ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. 'కుట్లు విప్పారు. గత రెండు రోజులుగా జిమ్‌కు వెళ్తున్నా. పూర్తి స్థాయిలో ఫిజియో జరుగుతోంది. నా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని కోరుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు' అని ఆ ట్వీట్‌లో కమల్ పేర్కొన్నారు. అంతకుముందు, వాట్సాప్ ఆడియోలో తమిళంలో ఆయన మాట్లాడుతూ, తన పట్ల ఇంతగా ప్రేమాభిమానులు చూపిస్తున్న అభిమానులు, మిత్రులు, కుటుంబసభ్యులు, మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలని అన్నారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, ఈ సమయంలో ప్రమాదం జరగడం దురదృష్టమేనని ఆయన వృత్తి పట్ల తనకున్న నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. ప్రస్తుతం కమల్ 'శభాష్ నాయుడు' చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







