స్వాతంత్ర దినోత్సవానికి ముస్తాబవుతున్న ఎర్రకోట.!
- August 13, 2016
ఆగస్టు 15న జరిగే 70వ స్వాతంత్య్రదినోత్సవానికి దేశరాజధాని దిల్లీలోని ఎర్రకోట ముస్తాబవుతోంది. వేడుకల్లో పాల్గొనే పలు పాఠశాలల చిన్నారులు రిహార్సల్స్ ప్రారంభించారు. మరోవైపు త్రివిధ దళాల సిబ్బంది కూడా విన్యాసాలు ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు డ్రోన్ల ద్వారా భద్రతా చర్యలు చేపట్టనున్నారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
దిల్లీలో భద్రత కట్టుదిట్టం మరోవైపు స్వాతంత్య్రదినోత్సవం నేపథ్యంలో దేశరాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 15న పోలీసుల సెలవులను రద్దు చేస్తున్నామని.. అందరూ హాజరుకావాలని పోలీస్ కమిషనర్ అలోక్ వర్మ చెప్పారు. ప్రతి పీసీఆర్ వ్యాన్‌లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని వర్మ సూచించారు. పర్యాటక ప్రదేశాలు, రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







