పంద్రాగస్టునాడు విధ్వంసానికి పన్నాగాలు: అప్రమత్తమైన నిఘావర్గాలు..

- August 13, 2016 , by Maagulf
పంద్రాగస్టునాడు విధ్వంసానికి పన్నాగాలు: అప్రమత్తమైన నిఘావర్గాలు..

ప్రధాని నరేంద్ర మోదీకి ఐఎస్‌, లష్కరే తయబా(ఎల్‌ఈటీ) వంటి ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పెరిగిందా? దీనికి కేంద్రనిఘా వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. కశ్మీర్‌లోని పుల్వమా ర్యాలీలో ఇటీవల లష్కరే కమాండర్‌ అబు దుజానా కనిపించడం ఇంటెలిజెన్స అధికారులను కలవరం కలిగించింది. సోమవారం ఢిల్లీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో మోదీతోపాటు కొంతమంది వీవీఐపీలను టార్గెట్‌ చేసేందుకు ఐఎస్‌, ఎల్‌ఈటీ ఉగ్రవాదులు పన్నాగాలు పన్నే అవకాశాలున్నాయని కేంద్ర నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. మోదీకి మునుపుటి కన్నా ముప్పు ఎక్కువ అయ్యిందని, ఆయనపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశాలు అధికమయ్యాయయని కేంద్ర నిఘావర్గాలు భావిస్తున్నాయి. మోదీపై దాడి జరిపేందుకు కశ్మీర్‌లోని తమ ఉగ్రవాదులను లష్కరే సంస్థ ఢిల్లీ పంపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా కేంద్ర నిఘావర్గాలకు తాజా సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రణాళిక అమలుపై పాకిస్థానలోని లష్కర్‌ సంస్థ కశ్మీరీ ఉగ్రవాదులతో చర్చించినట్లు తెలిసింది. కాగా, దూజానాకు సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడితో సహా అనేక దాడులకు వ్యూహాలు రూపొందించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com