అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ...
- August 13, 2016
నవీన్ చంద్ర, శ్రుతి సోథి జంటగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ,''అధినేత', 'ఏమైంది ఈ వేళ', 'బెంగాల్ టైగర్' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత మా బ్యానర్లో రూపొందిస్తున్న చిత్రమిది. హిలేరియస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. శుక్రవారంతో ముగిసిన ఫస్ట్ షెడ్యూల్‌తో 60శాతం సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ నెల 16 నుంచి నాన్‌స్టాప్‌గా జరిగే రెండో షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. దర్శకుడు సత్తిబాబు ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు వందశాతం వినోదాన్ని అందించే చిత్రమవుతుంది' అని అన్నారు. పృథ్వీ, సలోని, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి.పి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







