తప్పిపోయిన ఎమిరేట్ మత్స్యకారులను ఇరాన్ లో నిర్బంధించారు
- August 13, 2016
ఇరానియన్ జలాలలోకి పొరబాటున ప్రవేశించిన ఒక ఎమిరేట్ పడవ యజమాని,ముగ్గురు భారతీయ మత్స్యకారులను ఇరాన్ లో నిర్బంధించారు. షార్జా నుంచి చేపల వేటకు వెళ్ళిన ఈ బృందం ఇటీవల తప్పిపోయింది. తమ చేపల వేటలో పడవ యజమాని జస్సిమ్ అబ్దుల్లా అల్ రేఇస్సి అనుభవం కల్గిన ముగ్గురు భారతీయ జాలరులు రాబర్ట్ పర్తలోమి , సెల్వం జోసెఫ్ మరియు వియగుల ఆర్నాల్డ్ లు తప్పిపోయిన విషయాన్ని " మా గల్ఫ్ డాట్ కామ్ " నివేదించింది.ఈ తప్పిపోయిన ఈ ముగ్గురు భారతీయులు దక్షిణ భారత రాష్ట్రంలోని తమిళనాడుకు చెందినవారు .ఆచూకీ తెలియని ఎమిరేట్ పడవ యజమాని జస్సిమ్ బంధువైన ఒక వ్యక్తి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, జస్సిమ్ ఇరాన్ నుండి తన కుటుంబం సభ్యులతో మాట్లాడుతూ తాము తెలియకుండా ఇరానియన్ సముద్ర జలాల్లోనికి ప్రేవేశించడంతో ఇరానియన్ అధికారులు తమను అదుపులోకి తీసుకొన్నట్లు తన భార్యకు సమాచారం అందచేశాడని తెలిపాడు. తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని జస్సిమ్ బంధువు ఆగస్టు 2 వ తేదీన సముద్రంలో చేపలవేటకు తన ముగ్గురు భారతీయ జాలర్లతో వెళ్ళిన జస్సిమ్ మూడు రోజుల తర్వాత తెలియకుండా ఇరాన్ జలాల్లో చొరబడినట్లు భావించిన అక్కడి అధికారులు తమని నిర్బంధించినట్లు తన భార్యకు సమాచారం తెలిపాడు. వారిని ఇరానియన్ అధికారులు నిర్బంధించారు అక్కడ సురక్షితంగా ఉంటారని విశ్వసిస్తున్నట్లు ఆమె చెప్పారు. తర్వాత కోర్టులో జస్సిమ్ మరియు కార్మికులని ప్రవేశపెడతారు.ఆ తర్వాత విడుదల అవుతారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







