సెయిలింగ్ లో కుషాల్, హర్షిత జోడి చాంపియన్‌గా నిలిచింది
- August 13, 2016
అంతర్ రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ సెయిలింగ్ సంఘానికి చెందిన కుషాల్, హర్షిత జోడి చాంపియన్‌గా నిలిచింది. హుస్సేన్ సాగర్‌లో రెండు రోజుల పాటు జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో ఏడు రేసుల్లో ఓవరాల్‌గా 9 పాయింట్లు సాధించి ఈ జోడి అగ్రస్థానాన్ని సంపాదించింది.తెలంగాణ సెయిలింగ్ సంఘంకు చెందిన రెండు జట్లు... రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. దిలీప్, ఐశ్వర్య (తెలంగాణ) జోడి 12 పాయింట్లు సాధించి రన్నరప్‌గా నిలవగా... జస్ప్రీత్ సింగ్, రాగిణి (తెలంగాణ) జోడి 18 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ అమ్మాయి అరుంధతికి బెస్ట్ యంగెస్ట్ సెయిలర్ అవార్డు లభించింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







