తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- July 21, 2026
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పర్యాటకరంగాల ప్రగతికి విమానయాన రంగాన్ని విస్తరించడం ఎంతో కీలకంగా మారింది. ఇందులో భాగంగా వరంగల్ విమానాశ్రయంతో పాటు పలు జిల్లాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ఎయిర్‌పోర్ట్స్ (New Airports In Telangana)అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వేగంగా అడుగులు వేస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని కీలక ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్ విమానాశ్రయ పునరుద్ధరణ, పూర్తిస్థాయి అభివృద్ధి కోసం AAI సుమారు రూ. 496.86 కోట్ల వ్యయంతో సూత్రప్రాయ ఆమోదం తెలపడమే కాకుండా, రన్‌వే, టాక్సీవే, సరిహద్దు గోడ నిర్మాణాల కోసం టెండర్లను సైతం ఆహ్వానించింది.
అయితే, భూసేకరణ, పర్యావరణ అనుమతులు, నిధుల లభ్యత ఆధారంగానే ఈ ప్రాజెక్టు పూర్తి కానుందని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. మరోవైపు ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర, రక్షణ రంగాల ఉమ్మడి వినియోగం కోసం అభివృద్ధి చేసేందుకు AAI ఇప్పటికే ఫీజిబిలిటీ అధ్యయనం పూర్తి చేసింది. అలాగే పెద్దపల్లిలోని గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రాథమిక నివేదికను రాష్ట్రానికి అందజేయగా, భద్రాద్రి కొత్తగూడెం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ నూతన విమానాశ్రయాలు పూర్తయితే తెలంగాణలో ప్రాంతీయ అనుసంధానం మరింత బలోపేతం కానుంది.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







