కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- July 22, 2026
కువైట్ సిటీ: కువైట్ జనాభా 2026 జూన్ చివరి నాటికి 5.31 మిలియన్లకు చేరినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇందులో 1.56 మిలియన్ (30%) కువైట్ పౌరులు, 3.74 మిలియన్ల (70%) ప్రవాసులు ఉన్నారు.
ఆ దేశంలో నివసిస్తున్న విదేశీయులలో భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరి సంఖ్య సుమారు 10.6 లక్షలు (1.06 మిలియన్లు). ఇది ఆ దేశ మొత్తం జనాభాలో 20%కి సమానం. విదేశీయుల జాబితాలో 6.7 లక్షల మందితో ఈజిప్షియన్లు రెండవ స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశీయులు (3,33,100), ఫిలిప్పీనోలు (2,26,500), సిరియన్లు (2,01,500), శ్రీలంక వాసులు (1,97,400), నేపాలీలు (1,86,600), సౌదీలు (1,55,500) మరియు పాకిస్థానీలు (1,05,700) ఉన్నారు.
కువైట్ శ్రామిక శక్తిలో 32.64 లక్షల (3.264 మిలియన్ల) మంది ఉన్నారని, ఇది మొత్తం జనాభాలో 61% అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో విదేశీయులు 28 లక్షల (2.8 మిలియన్ల) మంది ఉండగా, వారు మొత్తం శ్రామిక శక్తిలో 75% వాటాను కలిగి ఉన్నారు.
ఉద్యోగుల్లో కూడా భారతీయులే 28.8 శాతంతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఈజిప్టు పౌరులు (14.6%), కువైటీలు (14.2%) ఉన్నారు. ప్రైవేట్ రంగంలో 30.7 శాతం ఉద్యోగాలు భారతీయుల వద్ద ఉండగా, ప్రభుత్వ రంగంలో 74.7 శాతం ఉద్యోగాలు కువైట్ పౌరులే నిర్వహిస్తున్నారు.
కువైట్‌లో 8.83 లక్షల మంది డొమెస్టిక్ వర్కర్స్ ఉండగా, వారు దేశ శ్రామిక శక్తిలో 27 శాతం. వీరిలో 57.7 శాతం మహిళలు. ఈ విభాగంలో కూడా 39 శాతం మంది భారతీయులే ఉండడం ఉన్నారు.
కువైట్ జనాభాలో 32.1 లక్షల మంది (60%) పురుషులు, 21 లక్షల మంది (40%) మహిళలు ఉన్నారు. అలాగే, 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు 42.8 లక్షల మంది (81%) ఉండగా, వీరే దేశ ప్రధాన పని చేసే వయస్సు గల జనాభాగా PACI వెల్లడించింది.
తాజా వార్తలు
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు
- బహ్రెయిన్-సౌదీ మధ్య సరిహద్దు ట్యాక్సీ సేవలు ప్రారంభం..
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్‌లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!







