ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- July 22, 2026
దోహా: ఖతార్‌లోని ప్రముఖ ఎఫ్ఎంసీజీ హోల్‌సేల్ సంస్థ అల్ రవాబీ హోల్‌సేల్ డివిజన్ వినియోగదారుల కోసం ‘షాప్ అండ్ విన్ – QR100,000 వర్త్ గిఫ్ట్స్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. మూడు నెలల పాటు సాగే ఈ ఆఫర్లో మొత్తం 100 మంది విజేతలకు QR100,000 విలువైన బహుమతులు అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. అల్ రయ్యాన్లోని హోల్‌సేల్ ప్లస్ స్టోర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ అసోసియేట్ డైరెక్టర్ మొహమ్మద్ జసీల్ ఈ ప్రచారాన్ని ప్రారంభించారు.
జూలై 15 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ కాలంలో అల్ రవాబీ హోల్‌సేల్ డివిజన్లో QR500 లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్‌కు ఒక ఎలక్ట్రానిక్ రాఫిల్ కూపన్ లభిస్తుంది. విజేతలకు 10 ఐఫోన్ 17 ప్రో (256GB) స్మార్ట్ఫోన్లు, 20 బంగారు నాణేలు, 70 గిఫ్ట్ వౌచర్లు బహుమతులుగా అందజేయనున్నారు. ప్రతి నెలా రెండు లక్కీ డ్రాలు నిర్వహించి, చివరి నెలలో మెగా డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేయనున్నారు.
ఈ సందర్భంగా అల్ రవాబీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ.. వినియోగదారుల విశ్వాసానికి కృతజ్ఞతగా ఈ ప్రచారాన్ని తీసుకొచ్చామని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులు, మెరుగైన సేవలతో పాటు వినియోగదారులకు మరింత విలువను అందించడమే సంస్థ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు
- బహ్రెయిన్-సౌదీ మధ్య సరిహద్దు ట్యాక్సీ సేవలు ప్రారంభం..
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్‌లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!







