గవర్నర్ ని కలిసిన BRS నేతలు
- September 09, 2026
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలిశారు. తెలంగాణ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం గవర్నర్‌ను కలిసింది. గవర్నర్‌ను కలిశాక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి గురించి గవర్నర్ కు వివరించామని తెలిపారు. అసెంబ్లీ గేటు వద్ద నిరసన తెలుపుతున్న సమయంలో మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు అత్యంత దురుసుగా ప్రవర్తించారని, వారిపై చేయిచేసుకున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కనీసం వారిపై కేసు నమోదు చేయలేదన్నారు.
పోలీసుల అనుచిత ప్రవర్తనకు హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ బేషరతుగా బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.: రాష్ట్రంలో శాంతి భద్రత లు పూర్తిగా క్షీణించాయని, ప్రతిపక్ష గొంతు నొక్కేలా ప్రభుత్వ తీరు ఉందని గవర్నర్‌కు వివరించినట్లు కేటీఆర్ మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గుదల
- బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’
- జర్మనీ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్..
- గవర్నర్ ని కలిసిన BRS నేతలు
- బిగ్బాస్ హౌస్లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
- కొత్త ప్రభుత్వ సీజన్ పై షేక్ మహమ్మద్ సమీక్ష..
- యూఏఈకి తిరిగి వస్తున్న విజ్ ఎయిర్..
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు
- బహ్రెయిన్-సౌదీ మధ్య సరిహద్దు ట్యాక్సీ సేవలు ప్రారంభం..
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!







