నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- July 23, 2026
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగర పరిధిలోని హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేలా ప్రతి పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.City & Local గైడ్స్
భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశాకే టెండర్లు
నగరంలో చేపట్టే ఏ నూతన ప్రాజెక్టుకైనా ముందుగా భూసేకరణ పూర్తి కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక అధికారిని కూడా నియమించినట్లు వెల్లడించారు. భూ సమస్యలు పరిష్కారం అయిన తర్వాతే టెండర్లు పిలవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సైబరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు
సైబరాబాద్ పరిధిలో తలపెట్టిన మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు. అదేవిధంగా ప్రధాన జంక్షన్ల అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. నగర సౌందర్యానికి భంగం కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పనులు వేగంగా ముగించాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ..ఎక్సైజ్ శాఖ సంచలన నిర్ణయం..
- కేసులు కొట్టేస్తానని చంద్రబాబు కు జడ్జి హామీ: పేర్ని నాని
- అటవీ సిబ్బంది భద్రతకు ఆయుధాలు అవసరం.. పోలీసుల పూర్తి సహకారం: డీజీపీ సీవీ ఆనంద్
- యూఏఈతో పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్న ఒడిశా..
- ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్..మంత్రి గొట్టిపాటి ప్రకటన
- మద్రాస్ రెజిమెంట్‌లో చోరీపై సీవీ ఆనంద్ సంచలన వివరాలు
- 18 మంది ఆసియా వాసులను అక్రమంగా తరలించే ప్రయత్నం భగ్నం
- ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్‌కు ఉత్సవ కమిటీ ఆహ్వానం
- పుతిన్‌కు ప్రధాని మోదీ అరుదైన కానుక!
- ట్రాన్స్జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్







