ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్‌కు ఉత్సవ కమిటీ ఆహ్వానం

- September 11, 2026 , by Maagulf
ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్‌కు ఉత్సవ కమిటీ ఆహ్వానం

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహాగణపతికి నిర్వహించే తొలి పూజకు హాజరై పూజలు చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఆహ్వానించింది.ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నేతృత్వంలోని గణేష్‌ ఉత్సవ కమిటీ ప్రతినిధులు శుక్రవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.ఈ సందర్భంగా ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవాల వివరాలను గవర్నర్‌కు వివరించారు.ఈ నెల 14వ తేదీ నుంచి 25 వరకు  గణేష్ ఉత్సవాలు జరగనున్నాయి.

అంతకు ముందు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ హైదరాబాద్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ డాక్టర్ వరుణ్ కిషోర్ ,తెలంగాణ క్షయవ్యాధి సంఘం ఉపాధ్యక్షుడు సుధీర్ ప్రసాద్ లోక్‌ భవన్‌లో గౌరవనీయ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిశారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com