విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- July 23, 2026
విజయవాడ: విదేశీ ఉద్యోగాల పేరుతో వందలాది మంది నిరుద్యోగులను నమ్మించి.. రూ. 13 కోట్లకు పైగా ముంచిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక జంట నకిలీ విదేశీ నియామక కన్సల్టెన్సీని నిర్వహిస్తూ.. పలు యూరోపియన్ దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నమ్మబలికి వందలాది మంది ఉద్యోగార్థుల నుంచి ఏకంగా రూ. విజయవాడ సమీపంలోని పైదురుపాడు గ్రామానికి చెందిన ముసునూరి శ్రీనివాస్, సౌజన్య అనే దంపతులు ఫ్లయింగ్ బోర్డర్స్ పేరుతో కన్సల్టెన్సీ సంస్థలను ఏర్పాటు చేశారు. వీరు నెదర్లాండ్స్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, ఫిన్లాండ్ వంటి విదేశాలలో వివిధ హోదాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రకటనలు ఇస్తూ నిరుద్యోగ యువతను బురిడీ కొట్టించారు.
దరఖాస్తులను రద్దు చేయడంతో పాటు ఫోన్ నంబర్లను బ్లాక్ చేస్తారు
ఈ దంపతులు ఆఫర్ చేసే ఉద్యోగాల కేటగిరీని బట్టి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 8 లక్షల నుండి రూ. 13 లక్షల వరకు దండుకున్నట్లు పోలీసులు తెలిపారు. తమ నియామక ప్రక్రియ నిజమైనదిగా ప్రతిబింబించేలా చేయడానికి తమ సొంత ముఠా సభ్యులతోనే విదేశీ కంపెనీల ప్రతినిధులుగా నటింపజేసి.. నకిలీ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలను కూడా నిర్వహించారు. ఇంటర్వ్యూల అనంతరం అభ్యర్థులకు సెలక్షన్ తృటిలో తప్పిందని లేదా అదనపు ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉందంటూ మరింత డబ్బు గుంజడం కొనసాగించారు. ఎవరైనా ప్రాసెస్ గురించి ప్రశ్నించినా లేదా చెల్లించిన డబ్బులు వాపసు ఇవ్వాలని కోరినా.. వారి దరఖాస్తులను రద్దు చేయడంతో పాటు వారి ఫోన్ నంబర్లను బ్లాక్ చేసేవారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం విజయవాడలో దాదాపు 700 మంది బాధితుల నుంచి రూ. 11 కోట్లు, విశాఖపట్నంలో సుమారు 130 మంది నుంచి మరో రూ. 2.2 కోట్లు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి.
తాజా వార్తలు
- ఆయు AIకి గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా ప్రశంసలు.. గో-టు-మార్కెట్ మద్దతు
- జర్మనీ పర్యటన ముగించుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్
- ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ..ఎక్సైజ్ శాఖ సంచలన నిర్ణయం..
- కేసులు కొట్టేస్తానని చంద్రబాబు కు జడ్జి హామీ: పేర్ని నాని
- అటవీ సిబ్బంది భద్రతకు ఆయుధాలు అవసరం.. పోలీసుల పూర్తి సహకారం: డీజీపీ సీవీ ఆనంద్
- యూఏఈతో పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్న ఒడిశా..
- ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్..మంత్రి గొట్టిపాటి ప్రకటన
- మద్రాస్ రెజిమెంట్‌లో చోరీపై సీవీ ఆనంద్ సంచలన వివరాలు
- 18 మంది ఆసియా వాసులను అక్రమంగా తరలించే ప్రయత్నం భగ్నం
- ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్‌కు ఉత్సవ కమిటీ ఆహ్వానం







