ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- July 24, 2026
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా సైన్యం వరుసగా 13వ రాత్రి కూడా వైమానిక దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేయడం, హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు మరియు పౌర నౌకాయానానికి ఉన్న ముప్పును తగ్గించడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని తెలిపింది.
సెంట్కామ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ దాడుల్లో ఇరాన్ సైనిక కమాండ్ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, తీర ప్రాంత నిఘా కేంద్రాలు, సముద్ర సంబంధిత సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు.
ఇరాన్ నుంచి హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు, పౌర నౌకాయానానికి ఏర్పడుతున్న ప్రమాదాన్ని మరింత తగ్గించడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని సెంట్కామ్ వెల్లడించింది.
ఇటీవలి రోజులుగా అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా సైన్యం వరుసగా 13 రాత్రులుగా ఇరాన్‌కు చెందిన సైనిక లక్ష్యాలపై దాడులు కొనసాగించడం ప్రాంతీయ పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి.
తాజా వార్తలు
- పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు..పోలీసు అధికారులతో డీజీపీ కీలక చర్చలు
- అబుదాబిలో యూఏఈ–ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ ఫోరం ప్రారంభం
- మంగినపూడి సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్
- తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
- దుబాయ్ పోలీస్ లగ్జరీ పెట్రోల్ ఫ్లీట్లోకి ‘మాన్సోరీ ఫెరారీ 812’
- సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారాతో షేక్ మహమ్మద్ భేటీ
- మంగినపూడి తీరంలో మహాగణపతి ఉత్సవాల్లో గవర్నర్‌తో కలిసి పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- ఏఐ న్యాయమూర్తి మనస్సాక్షిని, న్యాయ విచక్షణను భర్తీ చేయలేదు: జస్టిస్ సురేపల్లి నందా
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
- చారిత్రక భవనాల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి







