మంగినపూడి సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్

- September 15, 2026 , by Maagulf
మంగినపూడి సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్

మచిలీపట్నం: మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన సాగర తీర మహాగణపతి మహోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు.

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, DCMS చైర్మన్ బండి రామకృష్ణ తదితరులు కలిసి గవర్నర్‌ను ఘనంగా ఆహ్వానించారు.

అనంతరం రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ మహాగణపతి పూజా మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు గవర్నర్‌కు ఆశీర్వచనాలు అందించారు.

మహాగణపతి విగ్రహ నిర్మాణ విశిష్టత వివరించిన కమిటీ

పూజా కార్యక్రమాల అనంతరం సాగర తీర మహాగణపతి ఉత్సవ కమిటీ సభ్యులు గవర్నర్‌కు మహాగణపతి విగ్రహ నిర్మాణ విశిష్టతను వివరించారు. మంగినపట్నం, బందరు చరిత్ర, మచిలీపట్నం ప్రత్యేకతలను ప్రపంచానికి చాటిచెప్పే విధంగా ఉత్సవాల ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

సాగర తీరంలో మహాగణపతి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తూ, ఆధ్యాత్మికతతో పాటు మచిలీపట్నం చారిత్రక, సాంస్కృతిక విశిష్టతను ప్రజలకు పరిచయం చేసేలా కార్యక్రమాలను రూపొందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

గవర్నర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు

సాగర తీర మహాగణపతి ఉత్సవ సమితి ఆహ్వానాన్ని మన్నించి మచిలీపట్నం విచ్చేసి, మహాగణపతి స్వామివారి ఆశీస్సులు పొందిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌కు ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గవర్నర్ పర్యటనతో సాగర తీర మహాగణపతి మహోత్సవాలకు మరింత విశిష్టత చేకూరిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com