మంగినపూడి తీరంలో మహాగణపతి ఉత్సవాల్లో గవర్నర్‌తో కలిసి పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- September 15, 2026
మచిలీపట్నం: మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన సాగర తీర మహాగణపతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్తో కలిసి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం, సమృద్ధి కోసం గవర్నర్‌తో కలిసి ప్రార్థనలు చేశారు.
మంగినపూడి సాగర తీరంలో నిర్వహిస్తున్న మహాగణపతి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గణనాథుడి దర్శనం, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సాగర తీరం భక్తి వాతావరణాన్ని సంతరించుకుంది.
గవర్నర్‌తో కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం పట్ల ఎంపీ బాలశౌరి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీస్ లగ్జరీ పెట్రోల్ ఫ్లీట్లోకి ‘మాన్సోరీ ఫెరారీ 812’
- సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారాతో షేక్ మహమ్మద్ భేటీ
- మంగినపూడి తీరంలో మహాగణపతి ఉత్సవాల్లో గవర్నర్‌తో కలిసి పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- ఏఐ న్యాయమూర్తి మనస్సాక్షిని, న్యాయ విచక్షణను భర్తీ చేయలేదు: జస్టిస్ సురేపల్లి నందా
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
- చారిత్రక భవనాల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి
- కువైట్‌లో వాహనదారులకు గుడ్‌న్యూస్..!!
- ఒమన్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలు పునరుద్ధరణ..!!
- ఖతార్‌లో పేషెంట్ సేఫ్టీకి PHCC కీలక చర్యలు..స్పెషల్ క్యాంపెయిన్..!!
- యూఏఈ స్కూళ్లలో కఠిన నిబంధనలు.. హెయిర్‌స్టైల్, హూడీలు, ఎనర్జీ డ్రింక్స్‌పై ఆంక్షలు..!!







