భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- July 24, 2026
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ బిన్ హమద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. ఆసియాన్ (ASEAN) ట్రీటీ ఆఫ్ అమిటీ అండ్ కోఆపరేషన్ ఒప్పందం కుదిరి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన మంత్రుల సమావేశం సందర్భంగా ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా సముద్ర రవాణా, సప్లై చైన్స్ అంతరాయం లేకుండా కొనసాగేందుకు ఇరు దేశాలు సమన్వయాన్ని కొనసాగించాలని ఇరు మంత్రులు పునరుద్ఘాటించారు.
అలాగే ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం, పెండింగ్లో ఉన్న అన్ని అంశాలను దౌత్య, శాంతియుత మార్గాలు, పరస్పర అంగీకారంతో పరిష్కరించాల్సిన అవసరాన్ని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో ఫిలిప్పీన్స్ లోని ఒమన్ రాయబారి ఇంజినీర్ నాసర్ అల్ మన్వారితో పాటు ఇరు దేశాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు..పోలీసు అధికారులతో డీజీపీ కీలక చర్చలు
- అబుదాబిలో యూఏఈ–ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ ఫోరం ప్రారంభం
- మంగినపూడి సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్
- తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
- దుబాయ్ పోలీస్ లగ్జరీ పెట్రోల్ ఫ్లీట్లోకి ‘మాన్సోరీ ఫెరారీ 812’
- సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారాతో షేక్ మహమ్మద్ భేటీ
- మంగినపూడి తీరంలో మహాగణపతి ఉత్సవాల్లో గవర్నర్తో కలిసి పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- ఏఐ న్యాయమూర్తి మనస్సాక్షిని, న్యాయ విచక్షణను భర్తీ చేయలేదు: జస్టిస్ సురేపల్లి నందా
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
- చారిత్రక భవనాల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి







