గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- July 24, 2026
అబుదాబి: ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సౌకర్యార్థం అబుదాబిలో రెండు కొత్త బస్ సర్వీసులను ప్రారంభించారు. MR1 మరియు MR2 పేర్లతో ప్రారంభించిన ఈ బస్ లైన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ సిటీ రైల్వే స్టేషన్ ను మెయిన్ బస్ స్టేషన్ మరియు అల్ జహ్యా బస్ స్టేషన్ తో ఇరువైపులా అనుసంధానిస్తాయి. ఈ కొత్త బస్ సర్వీసుల ద్వారా ప్రయాణికులు ఎతిహాద్ రైల్ సేవలను మరింత సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.
ఎతిహాద్ రైల్ జూన్ 30న ప్రయాణికుల సేవల తొలి దశను ప్రారంభించింది. ఈ దశలో అబుదాబి–ఫుజైరా మధ్య రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైల్వే నెట్‌వర్క్‌ను సెప్టెంబర్ 30న అధికారికంగా ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం ఈ మార్గంలో రోజుకు ఆరు రైలు సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో మూడు సర్వీసులు అబుదాబి నుంచి ఫుజైరాకు, మరో మూడు ఫుజైరా నుంచి అబుదాబికి రన్ అవుతున్నాయి. ఈ రైళ్ల రాకపోకలకు అనుగుణంగా బస్, టాక్సీ సేవలను సమన్వయం చేస్తున్నట్లు ఎతిహాద్ రైల్ వెల్లడించింది. దీంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నది.
ఇక ప్రయాణికులకు 10 దిర్హామ్‌లతో షటిల్ బస్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. ఈ షటిల్ బస్ మొహమ్మద్ బిన్ జాయెద్ సిటీ స్టేషన్ నుంచి ADNOC ప్రధాన కార్యాలయం (కోర్నిష్ రోడ్ వెస్ట్), ADNEC సెంటర్, రీమ్ మాల్ వంటి ప్రధాన ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్తుంది. ఈ సేవను ఎతిహాద్ రైల్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
ఇక ఫుజైరా స్టేషన్‌లో కారు అద్దె సేవలు, టాక్సీ స్టాండ్‌లు, రైడ్-హైలింగ్ పిక్‌అప్ పాయింట్లు, బస్ కనెక్షన్లు కూడా అందుబాటులో ఉంటుంది. రాబోయే నెలల్లో మరిన్ని కారు అద్దె సంస్థలను కూడా ఎతిహాద్ రైల్ నెట్‌వర్క్‌లో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు..పోలీసు అధికారులతో డీజీపీ కీలక చర్చలు
- అబుదాబిలో యూఏఈ–ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ ఫోరం ప్రారంభం
- మంగినపూడి సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్
- తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
- దుబాయ్ పోలీస్ లగ్జరీ పెట్రోల్ ఫ్లీట్లోకి ‘మాన్సోరీ ఫెరారీ 812’
- సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారాతో షేక్ మహమ్మద్ భేటీ
- మంగినపూడి తీరంలో మహాగణపతి ఉత్సవాల్లో గవర్నర్తో కలిసి పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- ఏఐ న్యాయమూర్తి మనస్సాక్షిని, న్యాయ విచక్షణను భర్తీ చేయలేదు: జస్టిస్ సురేపల్లి నందా
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
- చారిత్రక భవనాల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి







