బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- July 24, 2026
ఢాకా: బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన షాబుద్దీన్ 2023 ఏప్రిల్ నెలలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2028 ఏప్రిల్‌తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. అయితే, పదవీకాలం ముగియడానికి రెండేళ్లు సమయం ఉండగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే షాబుద్దీన్ రాజీనామా చేసినట్లు రాయిటర్స్ పేర్కొంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2024 నుంచి ఇండియాలో తలదాచుకుంటున్నారు.
ఆమె ఈ ఏడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిన తర్వాత అవామీ లీగ్ పార్టీని బలోపేతం చేస్తానని షేక్ హసీనా చెప్పినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. హసీనా తిరిగి వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అవామీ లీగ్ పార్టీకి చెందిన షాబుద్దీన్‌ను పదవి నుంచి దిగిపొమ్మని ప్రభుత్వం అడిగినట్లు రాయిటర్స్ వెల్లడించింది.
బంగ్లాదేశ్ మీడియా కథనాల మేరకు.. షాబుద్దీన్ ఇండియాలో తలదాచుకుంటున్న షేక్ హసీనాతో మళ్లీ సంప్రదింపులు జరపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలిసి ప్రభుత్వం తీవ్ర అసంతృప్తికి గురైంది. ఈ నేపథ్యంలోనే షాబుద్దీన్ రాజీనామాకు తెరతీసింది.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







