అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- July 26, 2026
అబుదాబి:అనుమతి లేకుండా బరువు తగ్గించే పెప్టైడ్ ఆధారిత ఔషధాలను విక్రయిస్తున్న వారిపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు 71 మంది నిబంధనల ఉల్లంఘనదారులపై ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (EDE) చర్యలు తీసుకుంది. చర్యల్లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన 14 లైసెన్స్ పొందిన ఫార్మాస్యూటికల్ సంస్థలకు నోటీసులు జారీ చేయగా, సోషల్ మీడియా ద్వారా అనుమతి లేని ఔషధాలను ప్రచారం చేసిన 14 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను నేషనల్ మీడియా అథారిటీకి అప్పగించింది.
లైసెన్స్ పొందిన మెడిసిన్ వేర్ హౌజ్లో అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులు గుర్తించలేదని అధికారులు తెలిపారు. అయితే కంపౌండింగ్ ఫార్మసీల్లో తయారవుతున్న మెడిసిన్స్ భద్రత, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
సోషల్ మీడియా, ఆన్‌లైన్ వేదికల ద్వారా "100 శాతం సహజం", "పూర్తిగా సురక్షితం", "మ్యాజిక్ సొల్యూషన్" వంటి తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఈడీఈ హెచ్చరించింది. ఇలాంటి మందులు కొనుగోలు చేయడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదమని పేర్కొంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతున్న రెటాట్రుటైడ్ (Retatrutide) ఇంజెక్షన్‌కు యూఏఈలో ఇంకా అనుమతి లభించలేదని స్పష్టం చేసింది. ఇది ఇప్పటికీ క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉందని, వైద్య వినియోగానికి లేదా విక్రయానికి ఆమోదం పొందలేదని తెలిపింది.
ఇదిలా ఉండగా, వైద్యుల సూచన మేరకే వెగోవీ (Wegovy), ఓజెంపిక్ (Ozempic), మౌంజారో (Mounjaro) వంటి బరువు తగ్గించే మందులను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా లేదా అనధికారిక ఆన్‌లైన్ విక్రేతల నుంచి మందులు కొనుగోలు చేయవద్దని యూఏఈ అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లైబ్రరీ ప్రాజెక్టులపై సమీక్ష.. ఆక్స్ఫర్డ్ తో చర్చలు..!!
- సౌదీపై దాడుల ఎఫెక్ట్.. ఇరాక్‌లో మైసాన్ ఆపరేషన్స్ కమాండర్ తొలగింపు..!!
- 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- ఏ దేశానికి BRICS కూటమి వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
- ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!
- ఒమన్‌లో అక్రమ ప్రవేశాల వైరల్ వీడియోపై ROP క్లారిటీ..!!
- బహ్రెయిన్‌లో ఆహార వృథాను తగ్గించేందుకు పిలుపు..!!
- యూఏఈ స్కూళ్లలో వాట్సాప్ గ్రూపులకు కొత్త రూల్స్..!!
- ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ







