చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- July 26, 2026
దోహా: ఖతార్‌లో ఇటీవల అమల్లోకి వచ్చిన చక్కెర కలిగిన పానీయాలపై ఎక్సైజ్ పన్నుకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలపై జనరల్ టాక్స్ అథారిటీ (GTA) క్లారిటీ ఇచ్చింది. అన్ని చక్కెర ఉత్పత్తులపై లేదా అన్ని శీతల పానీయాలపై ఒకే విధంగా పన్ను విధించడం లేదని స్పష్టం చేసింది. జూలై 6 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం, పానీయంలోని చక్కెర పరిమాణం ఆధారంగా ఎక్సైజ్ పన్ను విధిస్తున్నట్లు జీటీఏ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు కీలక వివరాలను తెలియజేసింది.
జీటీఏ తెలిపిన వివరాల ప్రకారం, డైట్ మరియు జీరో షుగర్ కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్‌కు 0 శాతం ఎక్సైజ్ పన్ను మాత్రమే వర్తిస్తుంది. అలాగే, అన్ని చక్కెర పదార్థాలకు ఈ పన్ను వర్తించదని, అదనపు చక్కెర కలిపి తయారు చేసిన ప్రీ-ప్యాకేజ్డ్ స్వీటెండ్ డ్రింక్స్ కు మాత్రమే ఈ పన్ను అమలులో ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా, రెస్టారెంట్లు, కేఫేల్లో తాజాగా తయారు చేసి వెంటనే వినియోగానికి అందించే పానీయాలకు ఎక్సైజ్ పన్ను ఉండదని స్పష్టం చేసింది. పానీయంలో చక్కెర శాతం తక్కువగా ఉంటే తక్కువ లేదా సున్నా పన్ను, ఎక్కువగా ఉంటే అధిక పన్ను విధించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.
ఇక ఎనర్జీ డ్రింక్స్ మాత్రం ఈ కొత్త విధానానికి వర్తించవని, వాటిపై ఇప్పటికే అమల్లో ఉన్న 100 శాతం ఎక్సైజ్ పన్ను కొనసాగుతుందని జీటీఏ వెల్లడించింది. ప్రజలు ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకునేలా ప్రోత్సహించడం, ఖతార్ నేషనల్ విజన్-2030లోని ప్రజారోగ్య లక్ష్యాలను సాధించడమే ఈ విధానం ఉద్దేశమని జీటీఏ పేర్కొంది. అలాగే, చక్కెర పానీయాలపై వసూలయ్యే ఎక్సైజ్ పన్ను ఆదాయంలో 1 శాతం మొత్తాన్ని ఆరోగ్య అవగాహన కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రజారోగ్య మంత్రిత్వ శాఖకు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం
- వాణిజ్యం నుంచి లాజిస్టిక్స్ కారిడార్ల వరకు..విస్తరిస్తున్న భారత్-యూఏఈ ఆర్థిక భాగస్వామ్యం
- కువైట్ లైబ్రరీ ప్రాజెక్టులపై సమీక్ష.. ఆక్స్ఫర్డ్ తో చర్చలు..!!
- సౌదీపై దాడుల ఎఫెక్ట్.. ఇరాక్‌లో మైసాన్ ఆపరేషన్స్ కమాండర్ తొలగింపు..!!
- 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- ఏ దేశానికి BRICS కూటమి వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
- ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!
- ఒమన్‌లో అక్రమ ప్రవేశాల వైరల్ వీడియోపై ROP క్లారిటీ..!!







