ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం

- September 12, 2026 , by Maagulf
ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం

దోహా: ఖతార్ ప్రీమియర్ లీగ్ మరియు తెలుగు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత నిఖత్ జరీన్‌కు ఘనమైన "ఫెలిసిటేషన్ & కమ్యూనిటీ మీట్ " కార్యక్రమం గురువారం, సెప్టెంబర్ 10, 2026న దోహా ICC అశోక హాల్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల ముఖ్య అతిథిగా హాజరై నిఖత్ జరీన్‌ను సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నిఖత్ జరీన్ యువతకు, ముఖ్యంగా మహిళలకు ఒక స్ఫూర్తి ప్రదాత. తన కష్టం, పట్టుదలతో ప్రపంచ వేదికపై భారత జెండాను ఎగురవేసి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఆమె విజయాలు లక్షలాది మంది యువ క్రీడాకారులకు ఆదర్శం" అని అన్నారు.

భారత రాయబార కార్యాలయం ఫస్ట్ సెక్రటరీ హరీష్ పాండే విశిష్ట అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో  ISC అధ్యక్షులు EP అబ్దుల్ రెహ్మాన్, ICC అధ్యక్షులు AP మణికంటన్, ICBF అధ్యక్షులు షనవాస్ బావా, IBPC అధ్యక్షులు తాహా మహ్మద్, ICBF సలహా మండలి చైర్మన్ శ్రీ KS ప్రసాద్, మాజీ ICC ప్రధాన కార్యదర్శి K కృష్ణ కుమార్,DPS గ్రూప్ అడ్వైజర్ శ్రీమతి అస్నా నఫీజ్,QPL అధ్యక్షులు శ్రీ సిరాజ్ అన్సారి, TSA అధ్యక్షులు శ్రీధర్ అబ్బగౌని ,
పాల్గొని ప్రసంగించారు.

నిఖత్ జరీన్ తన అనుభవాలను పంచుకుంటూ,తన కుటుంబం,కమ్యూనిటీ నుండి లభించిన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఖతార్‌లోని పెద్ద సంఖ్యలో భారతీయులు, క్రీడా అభిమానులు పాల్గొని ఆమెతో ముచ్చటించారు.

ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఎంబసీ, ఖతార్ ఆధ్వర్యంలోని ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ అనుబంధంగా ఉన్న తెలుగు స్పోర్ట్స్ అసోసియేషన్ నిర్వహించింది. క్రీడల ద్వారా సమాజంలో స్ఫూర్తిని నింపడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com