రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- July 26, 2026
కువైట్ సిటీ: రెడ్ సిలో నౌకల పై హౌతీ తిరుగుబాటుదారులు వరుసగా జరుపుతున్న దాడులను కువైట్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల రెడ్ సిలో ప్రయాణిస్తున్న సౌదీ నౌక "ఎన్సీఏ మాసా (NCA MASA)" పై జరిగిన దాడిని కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలకు బహిరంగ ఉల్లంఘనగా, సముద్ర రవాణా భద్రతకు, నావిగేషన్ స్వేచ్ఛకు, అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రత్యక్ష ముప్పుగా నిలుస్తున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది.
ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి భంగం కలిగించే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని కువైట్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతను కాపాడేందుకు ప్రపంచ దేశాలు సమిష్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది.
రెడ్ సిలో వరుస దాడుల కారణంగా అంతర్జాతీయ వాణిజ్య రవాణాపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో, సముద్ర మార్గాల్లో భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







