ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- July 27, 2026
కువైట్ సిటీ: ఇరాన్‌పై సైనిక చర్యల్లో కువైట్ పాల్గొన్నట్లు అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) ప్రచురించిన కథనాన్ని కువైట్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ కథనంలో చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యం అని స్పష్టం చేసింది. జూలై 24న ప్రచురించిన కథనాన్ని వెంటనే సరిదిద్దాలని అమెరికాలోని కువైట్ రాయబారి షైఖా అల్ జైన్ అల్ సబాహ్ వాల్ స్ట్రీట్ జర్నల్ సంపాదక మండలికి అధికారిక లేఖ రాశారు.ప్రాంతీయ ఉద్రిక్తతల సమయంలో ఖచ్చితమైన సమాచారం అందించడం జర్నలిస్టుల బాధ్యత మాత్రమే కాకుండా, ప్రాంతీయ స్థిరత్వానికి కూడా అత్యంత అవసరమని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ శాంతి, భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రజలు తప్పుదోవ పట్టకుండా చూడాల్సిన బాధ్యత మీడియాపై ఉందని తెలిపారు.
ఇరాన్‌పై ఎలాంటి సైనిక చర్యల్లోనూ కువైట్ పాల్గొనలేదని, అలాగే పొరుగు దేశంపై దాడులు జరిపేందుకు తమ భూభాగం, గగనతలం లేదా ప్రాదేశిక జలాలను ఉపయోగించేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని రాయబారి స్పష్టం చేశారు.అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, దేశాల సార్వభౌమాధికారాన్ని కాపాడడం, పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించడం, వివాదాలను దౌత్య మార్గంలో పరిష్కరించడమే కువైట్ విదేశాంగ విధానానికి మూల సూత్రాలని ఆమె పేర్కొన్నారు. దశాబ్దాలుగా సంఘర్షణలతో తీవ్ర మానవ, ఆర్థిక నష్టాలను చవిచూసిన ఈ ప్రాంతంలో భద్రతను యుద్ధాల ద్వారా కాకుండా దౌత్యపరమైన చర్చలు, సంభాషణల ద్వారానే సాధించవచ్చని కువైట్ విశ్వసిస్తోందని షైఖా అల్ జైన్ అల్ సబాహ్ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







