ఖతార్ లో 8 ప్రాంతాల్లో క్లీనప్ డ్రైవ్ షెడ్యూల్..!!

- November 02, 2026 , by Maagulf
ఖతార్ లో 8 ప్రాంతాల్లో క్లీనప్ డ్రైవ్ షెడ్యూల్..!!

దోహా: ఖతార్‌లోని సముద్ర తీర ప్రాంతాలు, దీవులను పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ నవంబర్ 2026లో ప్రత్యేక క్లీనప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది బీచ్‌లు, దీవుల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు, నివాసితులు స్వచ్ఛందంగా పాల్గొనాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. మంత్రిత్వ శాఖకు చెందిన జనరల్ క్లీన్లీనెస్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఖతార్ నేషనల్ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

నవంబర్ 6న శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జక్రీత్ బీచ్‌లో తొలి కార్యక్రమం ప్రారంభం కానుంది. నవంబర్ 7న శనివారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సఫ్లియా ఐలాండ్‌లో శుభ్రత కార్యక్రమం నిర్వహిస్తారు. నవంబర్ 13న సల్వా బీచ్‌లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, నవంబర్ 14న సీలైన్ బీచ్‌లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు కార్యక్రమాలు జరగనున్నాయి.

అలాగే నవంబర్ 20న హువైలా బీచ్‌లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు, నవంబర్ 21న ఫ్రెహా బీచ్‌లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు క్లీనప్ డ్రైవ్ నిర్వహిస్తారు. నవంబర్ 27న లెఖ్వైర్ బీచ్‌లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు, చివరిగా నవంబర్ 28న అల్ వక్రా ఫ్యామిలీ బీచ్‌లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com