ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- July 27, 2026
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండం గా మారినట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల్లో ‘తీవ్ర వాయుగుండం గా రూపాంతరం చెంది ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, మరియు పోలవరం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అటు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
AP & TG Weather: గంటకు 65 కి.మీ వేగంతో గాలులు – మత్స్యకారులకు హెచ్చరికలు
తీరం వెంట గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున బుధవారం వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఆదేశించారు.వరద ప్రభావిత, లోతట్టు ప్రాంత ప్రజలు మరియు రైతు సోదరులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







