పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- July 27, 2026
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల్లో పారదర్శకతను పెంచేందుకు మరియు అక్రమాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026’ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఇటీవల నీట్ (NEET) సహా వివిధ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఈ కఠిన చట్టాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లుపై లోక్‌సభలో జరిగే చర్చలో అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలని కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ ముఖ్యమైన బిల్లుపై హౌస్‌ను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని, ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టించకుండా తమ అభిప్రాయాలను మరియు సూచనలను వెల్లడించాలని కోరారు. ఈ చర్చలో అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు కీలక ఎంపీలు పాల్గొననున్నారు.
సవరణ బిల్లులోని 7 కీలక ప్రతిపాదనలు
ఈ బిల్లును కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో చేర్చిన ముఖ్యమైన నిబంధనలు:
కఠినమైన జైలు శిక్ష: పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేలా సవరణలు చేశారు.
భారీ జరిమానాలు: వ్యక్తులకు విధించే జరిమానాను రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచారు.
సర్వీస్ ప్రొవైడర్లపై చర్యలు: అక్రమాలకు సహకరించే ఏజెన్సీలు లేదా సర్వీస్ ప్రొవైడర్లపై జరిమానాను రూ. 1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచారు. అంతేకాకుండా వారిని పరీక్షల నిర్వహణ నుంచి నిషేధించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగించారు. కంపెనీ డైరెక్టర్లకు కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు.
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ & గడువు: పరీక్షల కుంభకోణాలపై విచారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తారు. పోలీసులు లేదా సీబీఐ విచారణను 2 నెలల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: కేసుల వేగవంతమైన విచారణ కోసం ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి రోజువారీ విచారణ జరుపుతారు. ఈ సమావేశాల్లోనే ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సవరణ బిల్లు-2026’ను కూడా లోక్‌సభ ముందుకు తీసుకురానున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును చట్టంగా మార్చనున్నారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







