‘భగవంతుడు’ నుంచి రెండో పాట ‘సిత్తరాల నవ్వు’ విడుదల
- July 27, 2026
హైదరాబాద్: హీరో తిరువీర్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ‘భగవంతుడు’ చిత్రంలోని రెండో సింగిల్ ‘సిత్తరాల నవ్వు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమ, పల్లె అందాలను ప్రతిబింబించే ఈ మెలోడీ పాటను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది.
“ఆమె ఏరువాక పున్నమి... అతను కొండగాలి దేవర... ఆ ప్రేమ ఓ మట్టి పాట” అనే భావోద్వేగ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంలోని ప్రేమకథను ప్రతిబింబించేలా సాహిత్యం, సంగీతం అలరించేలా ఉన్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పాటకు కేపీ (KP) సంగీతం అందించగా, గోపి విహారి సాహిత్యం రచించారు. ప్రముఖ గాయకుడు జావేద్ అలీ తన మధుర గాత్రంతో పాటకు ప్రాణం పోశారు.
ఈ చిత్రంలో తిరువీర్, ఫరియా అబ్దుల్లాతో పాటు రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.చిత్రానికి రవి పనస నిర్మాతగా వ్యవహరిస్తుండగా, క్రాంతి దర్శకత్వం వహిస్తున్నారు.సినిమాటోగ్రఫీని రాజ్ తోట, ఎడిటింగ్‌ను ప్రవీణ్ పూడి నిర్వహించారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, తాజాగా వచ్చిన ‘సిత్తరాల నవ్వు’ పాటకు మంచి స్పందన లభిస్తుండగా, ‘భగవంతుడు’ చిత్రం త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







