వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- July 29, 2026
కువైట్: వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో వాహనాల్లో అగ్నిప్రమాదాల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని జనరల్ ఫైర్ ఫోర్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పలు జాగ్రత్తలను వెల్లడించింది. వాహనంలోని మెకానికల్, ఎలక్ట్రికల్ వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా గుర్తింపు పొందిన వర్క్‌షాప్‌లలో క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోవాలని సూచించింది.
అలాగే ఎండలో నిలిపి ఉంచిన వాహనాల్లో పెర్ఫ్యూమ్‌లు, లైటర్లు, ఛార్జర్లు, పవర్ బ్యాంక్‌లు వంటి మండే లేదా పేలే ప్రమాదం ఉన్న వస్తువులను ఉంచొద్దని హెచ్చరించింది.నాణ్యత లేని విద్యుత్ వైరింగ్ లేదా నాసిరకం ఎలక్ట్రికల్ కనెక్షన్లు ఏర్పాటు చేయకూడదని, అవి షార్ట్ సర్క్యూట్‌కు దారితీసి అగ్నిప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
అదేవిధంగా వాహనాల టైర్లు, బ్రేక్ వ్యవస్థలను తరచుగా తనిఖీ చేయాలని, వాహనంలో తప్పనిసరిగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉండే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఉంచుకోవాలని సూచించింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే 112 అత్యవసర సేవలకు ఫోన్ చేయాలని జనరల్ ఫైర్ ఫోర్స్ సూచించింది
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







