ఆగస్టు 5 నుంచి ప్లాస్టిక్ క్యాప్‌లు లేని ఎల్పీజీ సిలిండర్లు.. KNPC
- July 30, 2026
కువైట్: కువైట్‌లో ఆగస్టు 5 నుంచి తాత్కాలికంగా ప్లాస్టిక్ క్యాప్‌లు లేకుండా ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయనున్నట్లు కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (KNPC) ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల (Cooperative Societies) శాఖలకు పంపిన సర్క్యులర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
జూలై 27తేదీతో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని, సాధారణంగానే వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని KNPC స్పష్టం చేసింది. అయితే, నిర్వహణ పనులు పూర్తయ్యే వరకు సిలిండర్లపై ఉండే ప్లాస్టిక్ రక్షణ క్యాప్‌లు మాత్రమే తొలగించి సరఫరా చేయనున్నట్లు పేర్కొంది.
ప్లాస్టిక్ క్యాప్‌లతో కూడిన సిలిండర్ల సాధారణ సరఫరా ఎప్పుడు పునఃప్రారంభమవుతుందనే విషయాన్ని మాత్రం KNPC వెల్లడించలేదు. దీంతో తదుపరి ప్రకటన వచ్చే వరకు ఇదే విధానం అమల్లో కొనసాగనుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







