ఒమన్ – బ్రూనై మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!
- November 03, 2026
మస్కట్: ఒమన్, బ్రూనై దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచే సంయుక్త ప్రకటనతో పాటు పలు కీలక ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బ్రూనై రాజధాని బందర్ సేరి బెగవాన్‌లోని ఇస్తానా నూరుల్ ఇమాన్ రాజభవనంలో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
దౌత్య, ప్రత్యేక, సేవా, అధికారిక పాస్‌పోర్టులు కలిగిన వారికి పరస్పర వీసా మినహాయింపు కల్పించే ఒప్పందంపై కూడా ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అలాగే కార్మిక రంగం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య సహకారం, ఆర్థిక వ్యవహారాలు, వ్యూహాత్మక ప్రణాళిక, వ్యవసాయం, మత్స్య సంపద రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఒమన్ తరఫున విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ, వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ మంత్రి అన్వర్ బిన్ హిలాల్ అల్ జబ్రీ ఒప్పందాలపై సంతకాలు చేశారు. బ్రూనై తరఫున విదేశాంగ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ మతీన్, సామాజిక విధానం, కార్మిక వ్యవహారాల సమన్వయ మంత్రి, హోంమంత్రి అహ్మద్దీన్ బిన్ హాజీ అబ్దుల్ రెహ్మాన్, ఆర్థిక విధానాల సమన్వయ మంత్రి, ఆర్థికం, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ హాజీ అబ్దుల్ మనాఫ్, ఆరోగ్య మంత్రి డాక్టర్ మొహమ్మద్ ఇషామ్ బిన్ హాజీ జాఫర్ సంతకాలు చేశారు.
ఈ ఒప్పందాలతో ఒమన్, బ్రూనై మధ్య దౌత్య సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, వ్యవసాయం, కార్మిక రంగాల్లో పరస్పర సహకారం మరింత విస్తరించనుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- QRCS షెల్టర్ ప్రాజెక్టు.. 704 కుటుంబాలకు లబ్ధి..!!
- ఒమన్ – బ్రూనై మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!
- యూఏఈలో భారతీయ పాఠశాలల్లో దీపావళి సందడి..!!
- కువైట్‌లో ముగ్గురు ప్రవాసులకు మూడేళ్ల జైలు, బహిష్కరణ వేటు..!!
- ఏఎఫ్సీ ఆసియా కప్ 2027 షెడ్యూల్లో మార్పు..!!
- గల్ఫ్ డిజిటల్ చెల్లింపుల రంగంలో కీలక ముందడుగు..!
- ఖతార్‌లో క్లాస్జెన్ ఐ డ్రాప్స్ రీకాల్..!!
- బహ్రెయిన్ పాఠశాలల్లో పర్యావరణ పాఠాలు..!!
- యూఏఈలో వాహనాల కొనుగోలుపై కొత్త నిబంధనలు..!!
- భారత్ నుంచి పేపర్ దిగుమతులపై GCC యాంటీ డంపింగ్ విచారణ..!!







